Lock Down in Srikakulam: ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్..

Lock Down in Srikakulam | కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు (ఆదివారం) సంపూర్ణ లాక్ డౌన్.

Update: 2020-09-12 15:37 GMT

Lock Down in Srikakulam | కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు (ఆదివారం) సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తున్నట్లు కలెక్టర్ జే.నివాస్వె ల్లడించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని.. ప్రధాన మార్గాలు, కూడళ్ళలో చెక్ పోస్ట్లులు ఏర్పాటు చేశామన్నారు. వైద్య సేవలు మినహా ఇతర ఏ దుకాణాలు తెరవోద్దని కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇక కరోనా కేసుల వివరాలు చూస్తే.. గడిచిన 24 గంటల్లో 9,901 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,465 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,901 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. కడప 09, చిత్తూరు 08, ప్రకాశం 08,  నెల్లూరు 07, గుంటూరు 06, కృష్ణా 05, కర్నూల్ 05, విశాఖపట్నం 05, పశ్చిమగోదావరి 04, అనంతపురం 03, తూర్పుగోదావరి 03, శ్రీకాకుళం 02, విజయనగరం జిల్లాలో 02 చొప్పున  మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 75,394, కర్నూల్ జిల్లా 51,184, అనంతపురం జిల్లా 48,785, పచ్చిమ గోదావరి జిల్లా 49,398, చిత్తూర్ జిల్లా 48,441, విశాఖపట్నం జిల్లా 43,433, గుంటూరు జిల్లాలో 44,546, నెల్లూరు లో 42,530, కడప 35,580, ప్రకాశం జిల్లాలో 35,654 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News