విజయవాడలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

Update: 2020-10-21 09:34 GMT

విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రోజుకొక అవతారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు.

ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రం కూడా కావటంతో దర్శనాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మూల నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుంచి మూడు గంటల నుంచే భక్తులకు దర‌్శనాలు కల్పించారు అధికారులు. 13 వేల మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.

మూల నక్షత్రం సందర్భంగా ఇవాళ ఏపీ సీఎం జగన్ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరతారు సీఎం. 3 గంటల 40 నిమిషాలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని పండితుల ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుంటారు. 

Tags:    

Similar News