Chandrababu Naidu: మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయంపై సీఎం సమీక్ష
Chandrababu Naidu: కేసులు నమోదు చేశామని సీఎంకి వివరించిన అధికారులు
Chandrababu Naidu: మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయంపై సీఎం సమీక్ష
Chandrababu Naidu: మైనింగ్ శాఖలో ఐదేళ్ల పాటు జరిగిన కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా... 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్షించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి వెయ్యి 25 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయని అధికారులు తేల్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు వివరించారు. ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని, వినియోగదారులకు భారం కాకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.