CM Ramesh: ఏపీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది
CM Ramesh: అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించడం లేదు
CM Ramesh: ఏపీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది
CM Ramesh: ఏపీ పరిస్థితి చాల క్లిష్టంగా ఉందని.. ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలిపారు. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టడం లేదని... ప్రజలకు ప్రయోజనం కలిగే పనులు సైతం ఏపీ ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఉండాలని, కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చిచ్చు పెట్టి... రాజధాని మార్చాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా తీర్మానం చేశారని, మళ్లీ ఇప్పుడు భేషజాలకు పోయి రకరకాలుగా బయట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు... ప్రజా రాజధాని కేవలం అమరావతి మాత్రమేనని రమేశ్ స్పష్టం చేశారు.