CM Jagan: నేడు పల్నాడు జిల్లాలో సీఎం జగన్ టూర్

CM Jagan: క్రోసూరులో 4వ ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్న సీఎం

Update: 2023-06-12 02:44 GMT

CM Jagan: నేడు పల్నాడు జిల్లాలో సీఎం జగన్ టూర్

CM Jagan: ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 43 లక్షల, 10వేల, 165 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించనున్నారు. విద్యాకానుక కిట్ల పంపిణీని సీఎం జగన్‌ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని బడులు తెరిచిన తొలిరోజే అందించనున్నారు.

Tags:    

Similar News