గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ
*భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ
Narendra Modi: ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గన్నవరం విమానాశ్రయ నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. భీమవరంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో ప్రధానితో పాటు గవర్నర్, సీఎం పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. అనంతరం పెద అమిరంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.