CM Jagan: ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: మేకపాటి అంత్యక్రియలకు హాజరుకానున్న జగన్
ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 10 గంటల 45 నిమిషాలకు కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు. 10 గంటల 55 నిమిషాలకు కడప ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో ఉదయగిరికి బయల్దేరి వెళ్తారు. మేకపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి కడప వెళ్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.