CM Jagan: ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్‌కు శంకుస్థాపన

Update: 2022-05-17 00:53 GMT

ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. 15,000 కోట్ల రూపాయలతో 5,410 మెగావాట్ల విద్యుత్‌ను సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి కోసం సౌర విద్యుత్, పవన్ విద్యుత్ యూనిట్లను గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యం ఏర్పాటు చేసేందుకు, హైబ్రీడ్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.

కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ మండలం బ్రాహ్మణ పల్లి హామ్లెట్ గుమ్మటం తాండా వద్ద తొలిసారి ఏర్పాటు చేసిన ఇంటిగ్రీటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కు సంబందించిన ఫస్ట్ కాంక్రీట్ ప్లోర్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న గ్రీన్‌కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 10 గిగావాట్ స్టోరేజీ కెపాసిటీతో తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై దృష్టి సారించింది. తాజాగా 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయనుంది.

ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ బయలుదేరి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. గుమ్మటం తండా కు హెలిప్యాడ్‌ ద్వారా చేరుకొని, ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసి తిరిగి తాడేపల్లి కి పయణమవుతారు.

Full View


Tags:    

Similar News