CM Jagan: కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఆళ్లగడ్డలో వైఎస్సార్ భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల
CM Jagan: కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ జేఆర్ కళాశాల క్రీడా మైదానంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను బదిలీ చేస్తారు.
రెండో విడత పంట కోత, రబీ అవసరాల కోసం ఒక్కొక్కరికి మరో 4వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల 92వేల మంది రైతన్నలకు 2వేల కోట్ల 96లక్షల 4వేల రూపాయలు భరోసా సాయం అందనుంది. వచ్చే సంక్రాంతి రోజుల్లో ప్రతి రైతుకు మూడో విడతగా 2వేల రూపాయలు ప్రభుత్వం అందించనుంది.