CM Jagan: కృష్ణా జిల్లా కూడూరులో సీఎం జగన్‌ పర్యటించారు

CM Jagan: నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన వైసీపీ నేత ఉప్పాల రాంప్రసాద్

Update: 2023-06-18 11:16 GMT

CM Jagan: కృష్ణా జిల్లా కూడూరులో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: పెడన మండలం కూడూరులో సీఎం జగన్‌ పర్యటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన వైసీపీ నేత ఉప్పాల రాంప్రసాద్‌ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కృష్ణాజిల్లాకు చెందిన ఉప్పాల రాంప్రసాద్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. పెడన మండలం కూడూరుకు చెందిన రాంప్రసాద్‌ డీసీఎంఎస్‌ ఛైర్మెన్‌గా పనిచేశారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంప్రసాద్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. 

Tags:    

Similar News