CM Jagan: ఇవాళ బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: యడ్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

Update: 2022-12-21 03:17 GMT

CM Jagan: ఇవాళ బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఇవాళ బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. యడ్లపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూ్ల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 11 గంటలకు యడ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. 4 లక్షల 59 వేల 5వందల 64 మంది విద్యార్థులతో పాటు.. 59 వేల 176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్‌. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లు పంపిణీ చేయనుంది. 778 కోట్ల విలువైన బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో.. 686 కోట్ల విలువైన 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేయనుంది జగన్‌ ప్రభుత్వం. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

Tags:    

Similar News