ఏలూరు ఘటనపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్!

లూరులో వింత వ్యాధికి గురైన బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

Update: 2020-12-09 07:30 GMT

ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఏలూరులో వింత వ్యాధికి గురైన బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. లాబ్‌ టెస్టులపై ఎయిమ్స్, కేంద్ర వైద్య బృందాలు ఇచ్చిన నివేదికలపై అధికారులతో సీఎం జగన్‌ చర్చించనున్నారు.

అటు వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఆరు కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది. ఇప్పటివరకు 500 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. మరో 72 మంది చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు 29 మందిని తరలించారు. ఇప్పటికే ఏలూరు చేరుకున్న ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్ల బృందం.. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించింది. 

Tags:    

Similar News