CM Jagan Tour: నెల్లూరులో ఈనెల 9న జగన్ పర్యటన!

cm Jagan Tour: జగన్ నెల్లూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్

Update: 2021-01-05 01:24 GMT

AP CM Jagan (file photo)

CM Jagan Tour: అమ్మఒడి పథకం రెండో విడత నగదు బదిలీ కార్యక్ర మాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 9న ఏపి సీఎం జగన్ నెల్లూరు లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్బంగా ఎన్.టి.ఆర్. నగర్ శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానాన్ని సిద్దం చేస్తున్నారు.. సిఎం పర్యటన ఏర్పాట్లు ను రాష్ట్ర మంత్రి అనిల్ అధికారులతో కలిసి పరిశీలించారు.

కడప జిల్లాఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యింది. ఈనెల 11వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఉన్నట్లు తెలిపారు.కొవిడ్ నిబంధనల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు.

జగన్ సీఎం అయినప్పటి నుంచి కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారని మాజీ హర్షకుమార్ ఆరోపించారు. ఓదార్పు భరోసా యాత్రంలో భాగంగా హర్షకుమార్ కడప జిల్లాకు వచ్చారు. పులివెందుల, లింగాల మండలంలో పర్యటించారు. దళితులు టార్గెట్ గా సీఎం ప్రవర్తిస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం వరుస సంఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజమండ్రిలో భక్తులతో కలిసి టీడీపీ నేతలునిరాహారదీక్ష చేపట్టారు. విగ్రహాల ధ్వంసం ఘటనను రాజకీయం చేయరాదన్నారు. హిందుమతానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో 125 విగ్రహాలు పైగా ధ్వంసం చేస్తే ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు చెప్పారు. దోషులను పట్టుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా రాజనాల వాండ్లపల్లిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రారంభించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకం ధ్వసం చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురు టీడీపీ మద్దతుదారులను తెలిపారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తలెత్తిన గొడవల కారణంగానే శిలాఫలకం ధ్వంసం చేసారని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో మొదటి ఫేజ్ లో గుర్తించిన 12 మండలాల్లోని 12 గ్రామాల్లో జగనన శాశ్వత భూమి హక్కు, భూ రీ సర్వే ప్రారంభించారు. రైతులతో కలిసి డ్రోన్ సర్వే చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియాతో జగనన్న శాశ్వత భూ హక్కు భూ రీసర్వే మెగా ప్రాజెక్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ లో దేవాలయాల అర్చకులు, చర్చ్ ఫాథర్,ముస్లిం పెద్దలు లతో డిఎస్పీ శ్రావణి సమావేశం నిర్వహించారు. ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దేవాలయాల్లో కమిటీలు వేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు పోలీసుల సహాకారం తీసుకోవాలన్నారు.  

Tags:    

Similar News