కలెక్టర్లు, ఎస్పీలకు డిన్నర్ ట్రీట్.. కీలక నిర్ణయం ఉంటుందా?

పరిపాలనలో మరోసారి తనదైన ముద్ర వేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెగ ఆరాటపడుతున్నారు.

Update: 2019-12-15 07:21 GMT
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

పరిపాలనలో మరోసారి తనదైన ముద్ర వేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెగ ఆరాటపడుతున్నారు. ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. అయితే ఈ నెల 17 న రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు డిన్నర్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అమరావతిలో ఈ ట్రీట్ కోసం వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ట్రీట్ కు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర సీనియర్ ఐఎఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాపై సమగ్ర అవగాహన కలిగి ఉండటానికి ఆయా జిల్లాల వారి సమస్యలను తెలుసుకునేందుకు సిఎం జగన్ ఆ టేబుల్ వద్దకు వస్తారు. వారితో మాట్లాడి సమస్యలను ఎలా అధిగమించాలనే సూచనలు తీసుకోనున్నారు.

చంద్రబాబు నాయుడు పాలన లో, కలెక్టర్ల సమావేశం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేది. అయితే చంద్రబాబుకు బిన్నంగా జగన్ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ విందు సమావేశం ద్వారా ప్రతి జిల్లా సమస్యలను ఐడెంటిఫై చెయ్యాలని జగన్ భావిస్తున్నారు. ప్రతి జిల్లాకు విడిగా సమయం ఇవ్వడం ద్వారా అన్ని జగన్ జిల్లాలపై సమానంగా దృష్టి పెట్టారన్న సంకేతమూ ప్రజల్లోకి వెళుతుందని సీఎం భావిస్తున్నారట. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇస్తోన్న మొదటి ట్రీట్ ఇది.

గతంలో కలెక్టర్లు, ఎస్పీల సదస్సు నిర్వహించిన జగన్.. అక్రమ కట్టడాలు కూల్చెయ్యడం, స్పందన వంటి కీలక ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చారు. స్పందన కారణంగానే చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి జరిగే డిన్నర్ మీటింగ్ లో కూడా ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలావుంటే ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో కాఫీ మీట్ నిర్వహించాలని సిఎం జగన్ గతంలోనే సూచించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News