CM Jagan: మీరు మా రాష్ట్రానికి చేసే సాయం పునర్‌నిర్మాణానికి ఉపయోగపడుతుంది..
Jagan: విశాఖ సభకు.. అశేషంగా తరలివచ్చిన జనవాహిని ఉద్దేశించి.. ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులను స్మరించుకున్నారు.
CM Jagan: మీరు మా రాష్ట్రానికి చేసే సాయం పునర్‌నిర్మాణానికి ఉపయోగపడుతుంది..
Jagan: విశాఖ సభకు.. అశేషంగా తరలివచ్చిన జనవాహిని ఉద్దేశించి.. ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులను స్మరించుకున్నారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన మహాకవుల మాటలను గుర్తు చేశారు. వారి సాహిత్యాన్ని పలికి వినిపించారు. ప్రజాకవి వంగపండు, మహాకవులు శ్రీశ్రీ, గురజాడ వంటి వారిని స్మరించారు. 8 ఏళ్ల క్రితం విభజన వల్ల రాష్ట్రానికి ఏర్పడ్డ గాయం.. ఇంకా మానలేదని సీఎం జగన్ అన్నారు. కేంద్రం నుంచి సాయం అందితే.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. చేసిన సాయాన్ని మర్చిపోయే వాళ్లం కాదని.. సాయం చేసిన వారిని గుండెల్లో పెట్టుకునే సంస్కృతి తమదన్నారు.
విశాఖ సభలో ప్రధాని మోడీ ఎదుట.. మరోసారి రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాలను లేవనెత్తారు. గతంతో పాటు.. తాజాగా చేసిన తమ విన్నపాలను పెద్ద మనస్సుతో పరిగణలోకి తీసుకుంటారని.. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తారని.. మనసారా కోరుకుంటున్నట్లు.. విశాఖ సభా వేదికపై మోడీకి విజ్ఞప్తి చేశారు.
ప్రతీ ఒక్క కుటుంబం నిలదొక్కుకుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని.. ఏపీ సీఎం జగన్ అన్నారు. విద్యా, వైద్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ, గడప వద్దకు పాలనను ప్రాధాన్యాంశాలుగా అడుగులు ముందుకేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. శక్తిమేర అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి మరింత సాయం అందించాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.