CM Jagan: నేడు రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ టూర్
CM Jagan: కడప, బద్వేలు నియోజకవర్గాల్లో పర్యటన * బద్వేలులో బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫైల్ ఇమేజ్)
CM Jagan: ఇవాళ రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. కడప, బద్వేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు సీఎం జగన్. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి సుధా పేరును ప్రకటించనున్నారు. అనంతరం కడపలో పర్యటించనున్న సీఎం జగన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్.