Andhra Pradesh: దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితం ఉండాలి- జగన్
Andhra Pradesh: వైసీపీ మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
Andhra Pradesh: దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితం ఉండాలి- జగన్
Andhra Pradesh: వైసీపీ మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు నిరంతరం ప్రచారంలో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు, మంత్రులు కూడా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలని నేతలకు సూచించారు.