CM Jagan: ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన సీఎం జగన్
CM Jagan: ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్ ను పెంచాం
ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన సీఎం జగన్
CM Jagan: ఏపీ ఉద్యోగుల ఆందోళనపై సీఎం జగన్ స్పందించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీతో సహా ఉద్యోగుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. కొవిడ్ కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించిన కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. కారుణ్య నియామకాలను జూన్ 30వ తేదీ లోగా పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు మంచి జరగాలనే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచామని చెప్పారు.