Ugadi 2021: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం
Ugadi 2021: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
Ugadi 2021: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం
Ugadi 2021: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్లవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించి సుబ్బరామ సోమయాజులుకు అందజేశారు. ఈ ఏడాది కోవిడ్‌పై విజయం సాధిస్తామని ఆకాంక్షించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ప్లవ నామ సంవత్సరమంతా అనుకూల ఫలితాలు ఉన్నాయన్నారు ఏపీ ప్రభుత్వ ఆస్థాన పండితులు సుబ్బరామ సోమయాజులు. వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం, వ్యాపార రంగాలు పుంజుకుంటాయని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు కూడా ప్లవ నామ సంవత్సరం అనుకూలంగా ఉంటుందన్నారు.