CM Jagan: బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
CM Jagan: పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ
CM Jagan: బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5వేల,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.