డిప్లమేటిక్ పాస్ పోర్టు తీసుకున్న ఏపీ సీఎం జగన్

Update: 2019-07-20 07:07 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి డిప్లమేటిక్ పాస్ పోర్టు తీసుకున్నారు. విజయవాడలోని పాస్ పార్టు కార్యాలయానికి స్వయంగా వచ్చి ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్ పోర్టు స్థానంలో డిప్లమేటిక్ పాస్ పోర్టు పొందారు. విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చిన జగన్ దంపతులకు పాస్ పోర్టు కార్యాలయం అధికారులు డిప్లమేటిక్ పాస్ పోర్టు అందచేశారు. సీఎం రాక సందర్భంగా పాస్ పోర్టు కార్యాలయం పరిసరాల్లో అధికారులు భద్రత మరింత పటిష్టం చేశారు. గతంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కూడా ఈ పాస్ పోర్టు జారీ చేశారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన తన డిప్లమేటిక్ పాస్ పోర్టుని తిరిగి అధికారులకు అప్పగించారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ తిరుగులేని విజయంసాధించిన జగన్ ఆయన శనివారం విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న రీజనల్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చి ఈ పాస్ పోర్టు తీసుకొని వెళ్లారు. 

Tags:    

Similar News