CM Jagan: 2024 ఎన్నికల కోసం స్పెషల్ టీమ్

CM Jagan: ఎన్నికల టీమ్‌తో ఈనెల 27న సిఎం భేటీ

Update: 2022-04-25 04:30 GMT

పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన సీఎం జగన్

CM Jagan: గత మూడేళ్లుగా పాలనపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం జగన్ ఇకపై పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. 2024 ఎన్నికలకు టీమ్‌ను సిద్ధం చేసిన జగన్ రాబోయే రోజుల్లో ఎక్కువ సమయం పార్టీ కోసం కేటాయించనున్నట్లు సమాచారం. ఎన్నికల టీమ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే టీమ్ 2024 ను సిద్దం చేశారు సీఎం జగన్. పార్టీ అధ్యక్షులను, రీజనల్ ఇన్‌ఛార్జిలను నియమించారు. ఈ నెల 27 తేదీన మద్యహం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా మంత్రులకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, రీజనల్ ఇంఛార్జి లకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మే 2వ తేది నుండి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆ కార్యక్రమంతో పార్టీని ఆక్టివ్ చెయ్యాలి అని భావిస్తున్నారు జగన్.

అందుకోసం వీరందరికీ దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విపక్షాల దాడులను తిప్పికొంట్టేందుకు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా జిల్లాల్లో ఎక్కువగా పర్యటించే అంశాన్ని నేతలతో చర్చించనున్నారు సిఎం జగన్. మొత్తానికి రెండేళ్ల ముందే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన సీఎం జగన్ ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News