Jagan: రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ ఫోకస్
Jagan: జనవరిలో చేపట్టనున్న సంక్షేమ పథకాలపై దృష్టి
Jagan: రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ ఫోకస్
Jagan: రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. జనవరి నెలలో చేపట్టనున్న మరో మూడు కీలక సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. వచ్చే నెలలో మూడు వేల రూపాయల పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం తదితర అంశాలపై సీఎం జగన్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.