Andhra Pradesh: ఉగాది నాటికే కొత్త జిల్లాలు
Andhra Pradesh: ఉగాది నుంచి కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు ప్రారంభం
Andhra Pradesh: ఉగాది నాటికే కొత్త జిల్లాలు
Andhra Pradesh: ఏపీలో ఉగాది నాటికే కొత్త జిల్లాలు అందుబాటులోకి రావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉగాది నుంచి కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలను ప్రారంభించాలని అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు కేటాయించాలన్నారు. వారి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు.