క్వారంటైన్‌కు సిద్ధపడేవారికే ఏపీలోకి అనుమతి: జగన్

Update: 2020-03-28 11:37 GMT

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 14 రోజులు క్వారంటైన్ కు సిద్ధ పడేవారికి ఏపీలోకి అనుమతినివ్వాలని చెప్పారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై జగన్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారికి ఏపీలోకి అనుమతి ఇవ్వాలని జగన్‌ తెలిపారు. ఈ క్యాంపుల్లో కచ్చితంగా ఒక అధికారిని నియమించాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా అధికారి మాట్లాడాలని పేర్కొన్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు హోటళ్లను గుర్తించి శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.  




Tags:    

Similar News