Chandrababu: ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇచ్చే దిశగా కీలక అడుగు వేశారు.

Update: 2025-11-11 07:04 GMT

Chandrababu: ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇచ్చే దిశగా కీలక అడుగు వేశారు. ఇందులో భాగంగా, ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ముఖ్యమంత్రి పర్యటించి, ఎంఎస్‌ఎంఈ (MSME) పార్కును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ఆయన వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

నేడు 329 ఎకరాల్లో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు.

మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్‌ఎంఈ పార్కులకు 587 ఎకరాల్లో శంకుస్థాపన చేశారు.

బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, నాయునపల్లిలో ఏర్పాటు చేయనున్న చేనేత పార్కుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) స్థాపనను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం, ఆర్థిక వృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

Tags:    

Similar News