Chandrababu Naidu: వర్షంలో తన గొడుగు తానే పట్టుకుని వెళ్లిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అధికార గౌరవాలు, ఆడంబరాలకు దూరంగా ఉండే ఆయన, ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే సమయంలో స్వయంగా గొడుగు పట్టుకుని నడిచారు.

ఈ సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగింది. అదే సమయంలో అక్కడ వర్షం కురుస్తుండగా, పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ, వారెవరికీ పట్టించుకోకుండా చంద్రబాబు తానే గొడుగు పట్టుకుని చలాకీగా సమావేశ స్థలానికి నడుచుకుంటూ వెళ్లారు. ఆయన ఈ చర్య పార్టీలోని నేతలతో పాటు ప్రజల్లోనూ విశేషంగా చర్చనీయాంశమైంది.
టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ —
"ఎండైనా... వానైనా... దార్శనికుడి ముందడుగు... తానే పట్టాడు గొడుగు..."
అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
75 ఏళ్ల వయసులోనూ చురుకుగా, ప్రజల ముంగిట ఉంటూ పని చేసే చంద్రబాబు నాయుడు మరొకసారి తన వృత్తిపరమైన నిబద్ధతను చాటుకున్నారు.