Indrakeeladri: చంద్రబాబు దంపతులు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు..
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు – ఘనంగా జరగిన శరన్నవరాత్రి వేడుకలు
Indrakeeladri: చంద్రబాబు దంపతులు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. మంటపంలో చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. దుర్గమ్మ ప్రజలందర్నీ ఆశీర్వదించాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమ్మవారి దయతో ఏపీలో రిజర్వాయర్లు 94 శాతం మేర నిండాయని అన్నారు.