Chandrababu Naidu: క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం
Chandrababu Naidu: ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉందని గ్రహించి మసలుకోవాలి
Chandrababu Naidu: క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం
Chandrababu Naidu: క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశం అయ్యారు. నెల రోజుల పని తీరుపై వారితో చర్చించారు సీఎం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉందని గ్రహించి మసలుకోవాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. హెచ్‌వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు హితబోధ చేశారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలన్నారు సీఎం చంద్రబాబు.