హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. భార్యతో చివరిసారిగా ఫోన్‌లో..
Bipin Rawat Chopper Crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు యువకుడు కూడా ఉన్నాడు.
Bipin Rawat Chopper Crash: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..
Bipin Rawat Chopper Crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు యువకుడు కూడా ఉన్నాడు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ అధికారి బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సాయితేజ విధులు నిర్వహిస్తున్నారు. బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ కూడా హెలికాప్టర్ ఎక్కారు. తమళినాడులో జరిగిన ప్రమాదంలో సాయితేజ కూడా చనిపోయాడు.
సాయితేజకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయితేజ్ భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయితేజ తల్లి భువనేశ్వరి గతంలో ఎంపీటీసీగా సేవలు అందించారు. ప్రస్తుతం సాయితేజ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు సడన్‌గా తన పెద్ద కుమారుడు సాయితేజ చనిపోయవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సాయితేజ చనిపోవడంతో ఎగువ రేగడ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.