Chittoor: భక్తులతో కిటకిటలాడిన చిత్తూరు బోయకొండ గంగమ్మ ఆలయం

Chittoor: ఒకరోజే సమకూరిన రూ.12 లక్షల ఆదాయం

Update: 2023-07-02 13:17 GMT

Chittoor: భక్తులతో కిటకిటలాడిన చిత్తూరు బోయకొండ గంగమ్మ ఆలయం

Chittoor: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఉదయం 5 గంటల నుండే భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానికి కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేవలం ఈరోజు అమ్మవారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రికార్డు స్థాయిలో 12 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది.

Tags:    

Similar News