అనకాపల్లి ఎంపీగా తన కుమారుడికి ఎంపీ టికెట్ కోరిన అయ్యన్నపాత్రుడు
Chintakayala Ayyanna Patrudu: చంద్రబాబు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా తన కుమారుడు పోటీ చేస్తాడని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అనకాపల్లి ఎంపీగా తన కుమారుడికి ఎంపీ టికెట్ కోరిన అయ్యన్నపాత్రుడు
Chintakayala Ayyanna Patrudu: చంద్రబాబు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా తన కుమారుడు పోటీ చేస్తాడని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో రా కదలిరా సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రా కదలిరా సభలో మాట్లాడిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తన కుమారుడు చింతకాయల విజయ్‌కు ఎంపీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. టీడీపీ అధినేత తన కుమారుడికి ఎంపీ సీటు ఇస్తే.. తనను ఎలా ఆదరించారో తన కుమారుడిని అలాగే ఆదరించాలని అయ్యన్న పాత్రుడు కార్యకర్తలను కోరారు.