Srikakulam: తీవ్ర విషాదం.. వీధి కుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి
Srikakulam: ఏడాదిన్నర చిన్నారిపై దాడి చేసిన కుక్కలు
Srikakulam: తీవ్ర విషాదం.. వీధి కుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఏడాదిన్నరి చిన్నారి మృతిచెందింది. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని వీధి కుక్కలు కరిచాయి. కుక్కుల దాడి చేసిన వెంటనే రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి సాత్వికపై వీధి కుక్కలు దాడి చేశాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించే సరికి చిన్నారి తల ,మెడ, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయాలవడంతో చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. సాత్విక మృతితో మెట్టవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.