Andhra News: గుడిబండ సమీపంలోని పొలంలో కొబ్బరి చెట్టుపై చిరుతల విన్యాసాలు
Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో చిరుతల కలకలం
Andhra News: గుడిబండ సమీపంలోని పొలంలో కొబ్బరి చెట్టుపై చిరుతల విన్యాసాలు
Andhra News: శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. పంట పొల్లాల్లో విహరిస్తూ గ్రామస్థులను బెంబేలెత్తిస్తున్నాయి. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రం సమీపంలోని మొక్కజొన్న పొలంలో కొబ్బరి చెట్టుపై చిరుతలు విన్యాసాలు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే చిరుతలను సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలో నిత్యం చిరుతలు, ఎలుగుబంట్లు విహరిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతలను బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.