Cheddi Gang-Tirupathi: తిరుపతిలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్
*విద్యానగర్ లో చోరీకి విఫలయత్నం *సీసీటీవీ ఫుటేజి ఆధారంగా వివరాలు సేకరణ *వరుస చోరీలపై పోలీసుల నిఘా
తిరుపతిలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్(ఫోటో- ది హన్స్ ఇండియా)
Chaddi Gang - Tirupathi: తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తుంది. విద్యానగర్ లో ఓ అపార్ట్ మెంట్ లోని మొదటి అంతస్తులో చోరీకి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంట్లో ఎలాంటి బంగారు నగలు ఉంచకపోవడంతో భారీ చోరీ నుంచి బయటపడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ముత్యాలరెడ్డి పల్లి పోలీసులు, క్రైం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతిలో వరుసగా జరుగుతున్న చోరీలపై నిఘా ఉంచారు చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్న ముటాకు సంబంధాలు ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.