AP Curfew: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
AP Curfew: మరో నాలుగు గంటలపాటు కర్ఫ్యూను సడలించిన ప్రభుత్వం * ఉ.6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు
ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు (ఫైల్ ఇమేజ్)
AP Curfew: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేసింది రాష్ట్ర సర్కార్. మరో నాలుగు గంటలపాటు కర్ఫ్యూను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూను సడలించింది. పాజిటివిటీ రేటు 5 శాతానికి వచ్చేంతవరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. కోవిడ్ ప్రొటోకాల్ ఫాలో అవుతూ రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాల నిర్వహణకు పర్మిషన్ ఇచ్చింది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరి అని తెలిపింది.