Chandrababu Naidu: విజయవాడలో కొండచరియలు విరిగి పడిన ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu Naidu: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కార్
Chandrababu Naidu
Chandrababu Naidu: కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 5 లక్షల రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మేఘన, లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు.