జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం లేదు.

Update: 2019-05-29 07:36 GMT

రేపు మధ్యాహ్నం విజయవాడలో ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందిలే. ఈ ప్రమాణోత్సవానికి దేశ వ్యాప్తంగా నాయకులకు ఆహ్వానాలు పంపించారు. కొందరిని జగన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు. మరి కొందరిని ఫోన్ లో పిలిచారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి జగన్ స్వయంగా ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి రావలసినదిగా ఆహ్వానించారు. అయితే, ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తమ పార్టీ తరఫున ఇద్దరు కీలక నేతలను జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపించాలని భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ముందుగా రేపు ఉదయం ఉండవల్లి లోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ ను కలుస్తారనీ, అక్కడ ఆయనకు అభినందనలు తెలిపిన అనంతరం మధ్యాహ్నం జరిగే ప్రమాణోత్సవానికి హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  

Similar News