టీడీపీ హయాంలో 71శాతం పోలవరం పనులను పూర్తి చేశాం : చంద్రబాబు

టీడీపీ హాయంలో పోలవరం పనులు 71శాతం పూర్తయ్యాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం పూర్తి చేస్తే.. ఏపీలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చని వెల్లడించారు.

Update: 2020-11-01 10:20 GMT

టీడీపీ హాయంలో పోలవరం పనులు 71శాతం పూర్తయ్యాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం పూర్తి చేస్తే.. ఏపీలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చని వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపామని స్పష్టం చేశారు.. 2018లో సవరించిన అంచనాల మేరకు రూ.57 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే రూ.55 వేల కోట్ల అంచనాను కేంద్రం ఆమోదించిందని చెప్పారు. జగన్ తన అవగాహన రాహిత్యంతో రాష్ట్రానికి నష్టం చేయొద్దన్నారు. KCR సహకారంతో ప్రాజెక్టులుకడతానన్న జగన్.. ఇప్పుడా ఊసే ఎత్తట్లేదన్నారు. పోలవరం అన్యాయంపై మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.

అటు పోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ నిన్న ఏడు పేజీల లేఖ రాశారు. నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతోందని, ఇరిగేషన్‌, భూసేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం చేతిలో ఉందని విభజన చట్టంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టిందని, కేంద్రం రూ.8,507కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉందని జగన్ అ లేఖలో పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయండని జగన్ కోరారు.

Tags:    

Similar News