విశాఖ స్టీల్ ప్లాంట్ఇచ్చిన హామీని నిలుపుకున్నాం: చంద్రబాబు

ఈ ప్యాకేజీపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Update: 2025-01-17 14:33 GMT

 విశాఖ స్టీల్ ప్లాంట్ఇచ్చిన హామీని నిలుపుకున్నాం: చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామని ఇచ్చిన హామీని నిలుపుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ప్యాకేజీపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కుకు ప్రాణం పోశారని ఆయన అన్నారు. ఏపీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండదనేందుకు ఇది నిదర్శనమని ఆయన చెప్పారు.

విశాఖ స్టీల్ ప్టాంట్ ను ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది వచ్చినా ఎన్డీయే ఆదుకుందని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకున్నట్టు చెప్పారు.స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తీసుకున్న చర్యలు కలిసి వచ్చాయని ఆయన వివరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా జేఏసీగా ఏర్పడి కార్మికులు పోరాటం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఎన్నికల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి.

Tags:    

Similar News