చంద్రబాబు విశాఖ టూర్‌పై టెన్షన్.. ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవాళ విశాఖపట్టణం, విజయనగరంలో పర్యటించనున్నారు.

Update: 2020-02-27 03:57 GMT
Chandrababu File Photo

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవాళ విశాఖపట్టణం, విజయనగరంలో పర్యటించనున్నారు. అయితే విజయనగరం పర్యటనను అనుమతి లభించింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్టణాన్ని ప్రకటించిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా ఇక్కడకు రాబోతున్నారు. విశాఖలో ఆయన పర్యటన మాత్రం బ్రేక్ పడేలా కనిపిస్తోంది. టీడీపీ విశాఖలో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెందుర్తిలోని భూసమీకరణ బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు.

అయితే చంద్రబాబు టూర్‌పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను వ్యతిరేకిస్తూ.. ఉత్తరాంధ్రను అవహేళన చేసేలా మాట్లాడిన చంద్రబాబును పర్యటనలు అడ్డుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ఎమ్మెల్యేలతో భారీ ర్యాలీగా పెందుర్తి వెళ్లాలని టీడీపీ భావించింది. ఆంక్షలు విధిస్తూ.. విశాఖ పోలీసులు ర్యాలీకి అనుమతి పర్మిషన్ ఇవ్వలేదు.

చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, పలువురు నేతలు తక్కువమంది ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. భూసమీకరణ బాధితులను పరామర్శించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులను మాత్రమే మంజూరు చేసింది. అయితే టీడీపీ నేతలు మాత్రం పోలీసులు అనుమతి లేకున్నా తాము భారీ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేయడం చేశారు. వైసీపీ నేతలు చంద్రబాబును అడ్డుకుంటామని ప్రకటించడం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇవాళ విశాఖలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.


Tags:    

Similar News