Chandrababu: రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన

Chandrababu: మూడ్రోజుల పాటు పర్యటించనున్న చంద్రబాబు

Update: 2023-12-27 04:35 GMT

Chandrababu: రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీకానున్నారు. రాత్రి 8.45కి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్‌ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కుప్పంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఓ కన్వెన్షన్ హాల్‌లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగ భేటీకానున్నారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పీఈఎస్ సమీపంలోని కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం, మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నాలుగున్నర గంటలకు మల్లానూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags:    

Similar News