Vidadala Rajini: ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్న వ్యక్తి చంద్రబాబు
Vidadala Rajini: ప్రజలను మోసం చేయడానికే ఇలాంటి ప్రకటనలు
Vidadala Rajini: ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్న వ్యక్తి చంద్రబాబు
Vidadala Rajini: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంపై మంత్రి విడదల రజిని సెటైర్లు వేశారు. ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకొని చంద్రబాబు అరెస్టయ్యారని, ఇప్పుడు ఎలాంటి తప్పు చేయనట్లు మోత మోగిద్దామని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీకి మోత మోగించి ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో మోత మోగించారన్న మంత్రి రజిని.. రానున్న ఎన్నికల్లో మరోసారి జగనన్నను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా మెడికల్ క్యాంప్‌ను మంత్రి విడదల రజిని ప్రారంభించారు.