Chandrababu: వైసీపీకి ఈసారి 175 సీట్లు కాదు గుండుసున్నానే..
Chandrababu: వచ్చే ఎన్నికల్లో YCP 175 సీట్లు కాదుకదా.. గుండు సున్నాకు పరిమితమవుతుందని TDP అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu: వైసీపీకి ఈసారి 175 సీట్లు కాదు గుండుసున్నానే..
Chandrababu: వచ్చే ఎన్నికల్లో YCP 175 సీట్లు కాదుకదా.. గుండు సున్నాకు పరిమితమవుతుందని TDP అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అమరావతిలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించారు. ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని TDP అధికారంలో ఉండగా 70 శాతం మత్య్స ఉత్పత్తులు ఏపీ నుంచే రవాణా అయ్యేవన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీ తొలగించి నడ్డి విరుస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు కత్తి మెడ మీద పెట్టి బలవంతంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారని ధ్వజమెత్తారు.
పాలన చేతకాకపోతే చెంపలు వేసుకొని రాజీనామా చేసి వెళ్లాలని.. పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. ఒకసారి బటన్ నొక్కి పన్నుల రూపంలో డబ్బు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోతోందని జగన్ అధికారంలోకి వచ్చాకా వ్యవస్థలన్నీ నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.