Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Update: 2024-04-20 04:00 GMT

Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తిరుపతి, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. గూడూరు, పొదలకూరు, సత్యవేడులో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.

నిన్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఆలూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజాగళంలో ఆయన పాల్గొన్నారు. ఇవాళ్టి సభలను సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News