Chandrababu: వైసీపీ సినిమా అయిపోయింది...100 రోజులు ఆగండి

Chandrababu: కుప్పంలో లక్ష మెజారిటీతో గెలువబోతున్నాం

Update: 2023-12-29 02:33 GMT

Chandrababu: వైసీపీ సినిమా అయిపోయింది...100 రోజులు ఆగండి

Chandrababu: వైసీపీ సినిమా అయిపోయింది.. ఇంకా 100 రోజులే మిగిలిందని TDP అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘కుప్పం సొంత కుటుంబం లాంటిదని... ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు అమలు చేసే బాధ్యత తనదన్నారు. ప్రతి ఇంటికీ రెండు ఆవులు ఉంటే మంచిదని ఆనాడే చెప్పా. ఆవులు పెంచడం ఏంటని అప్పుడు ఎగతాళి చేశారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, నిరుద్యోగులకు నెలకు 3వేలు ఇస్తామని చెప్పారు.

Tags:    

Similar News