Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
* ఈనెల 9న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ * గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం(ఫైల్ ఫోటో)
Low Pressure: ఈనెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కోస్తా, ఆంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 50కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.