Andhra Pradesh: నేటి నుంచి మూడ్రోజులపాటు ఏపీలో కేంద్ర బృందం పర్యటన
Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఏడుగురు సభ్యులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఏడుగురు సభ్యులు (ఫోటో ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని పలు జిల్లాల్లో విపత్తు ఏర్పడింది. కడప, చిత్తూరు, నెల్లూరులో దంచికొట్టిన వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. పంటలు నీట మునిగాయి. మూగ జీవాలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఈ జిల్లాల్లో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్రం బృందం ఇవాళ ఏపీకి రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడ్రోజులపాటు పర్యటించనున్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ నేతృత్వంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారు. నేడు చిత్తూరు జిల్లాలో ఒక బృందం పర్యటించనుంది. రేపు కడప జిల్లాలో మరో బృందం పర్యటించనుంది. ఎల్లుండి నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. ఈనెల 29న కేంద్ర బృంద సభ్యులు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు.