Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ ప్రైవేటీకరణపై కేంద్రం ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను వంద శాతం అమ్మేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది.

Update: 2021-03-08 11:50 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ ప్రైవేటీకరణపై కేంద్రం ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను వంద శాతం అమ్మేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. మెరుగైన ఉద్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లిఖితపూర్వకంగా తెలియజేశారు.

షేర్లు కొనుగోలుపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపిన కేంద్రం భాగస్వాములు, ఉద్యోగుల షేర్లు కొనుగోలు చేసేలా ప్రతిపాదించినట్లు కేంద్రం తెలిపింది. ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంచడం కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపింది. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్ లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News