Pankaj Chaudhary: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్యాకేజీ ఇచ్చాం

Pankaj Chaudhary: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

Update: 2021-12-21 12:30 GMT

Pankaj Chaudhary: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్యాకేజీ ఇచ్చాం

Pankaj Chaudhary: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నీతి అయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత మాది. ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఏపీకి 2015-19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాం. ఏపీ ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు రుణం సమకూర్చాం. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణంపై వడ్డీ కడుతున్నాం. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ.22,112 కోట్లు ఏపీకి అందించాం. 2020-21లో ఏపీకి రూ.5,897 కోట్లు ఇచ్చాం అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వివరించారు.

Tags:    

Similar News